నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్‌లోని న్యూక్లియర్ ప్లాంట్లే లక్ష్యంగా ఇజ్రాయిల్-అమెరికా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అణు నిల్వలపై నిరంతర దాడులతో రెండు దేశాలు పెను విస్పోటనం సృష్టించడానికి కంకణం కట్టుకున్నాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇరాన్‌లోని బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్‌లో రేడియేషన్ లీకేజీ భయాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ఆందోళన వ్యక్తంచేసింది. ఆ ప్లాంట్‌లో పెద్ద మొత్తంలో అణుపదార్థాలు ఉన్నట్టు ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రూసి పేర్కొన్నారు.
‘‘బుషెహర్‌లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఎక్కువ మొత్తంలో అణుపదార్థాలు నిల్వ ఉన్నాయి. దీనికి ప్రమాదం జరిగితే రేడియేషన్ లీకేజీ వల్ల ఇరాన్‌తో(Iran) పాటు ఆ దేశం వెలుపలా భారీస్థాయిలో ప్రమాదం జరిగే ముప్పు పొంచిఉంది. ఇలాంటి ప్రమాదాన్ని నివారించేందుకు అన్ని పక్షాలు సంయమనం పాటించాలి’’ అని ఐఏఈఏ డైరెక్టర్ గ్రూసి పిలుపునిచ్చారు.



