- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ‘బంగారు బాబు’గా పేరుగాంచిన హోప్ ఫౌండేషన్, తెలంగాణ హాకీ చైర్మన్ కొండ విజయ్ కుమార్ని ఢిల్లీ ఐటీ అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. న్యూఢిల్లీలో హాకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్తుండగా ఈ అరెస్ట్ జరిగింది. అధికారులు ఆయన ఒంటిపై ఉన్న బంగారాన్ని సీజ్ చేసి, ఆస్తుల వివరాలను సేకరించారు. 12 గంటల విచారణ తర్వాత అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్లడానికి అనుమతించి, మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు.
- Advertisement -



