నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్-అమెరికాలపై ప్రతీదాడులను ఇరాన్ తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే. డ్రోన్లు, కిపణుల దాడులతో అల్లకల్లోలం చేస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న యూఎస్ స్థానిక స్థావరాలపై బాంబులు వేస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్ దాడులను ఎదురించలేక యూఎస్ సైనికులు ఆయా స్థానిక స్థావరాలను వీడి స్థానిక గల్ఫ్ దేశాల్లోని పలు హోటల్స్‌కు మకాం మార్చారు. హోటల్‌ల్లో ఉంటూ యుద్ధానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం గల్ప్ దేశాలకు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.
ఇరాన్‌పై దాడి చేసిన స్థావరాలను విడిచిపెట్టిన చాలా మంది అమెరికా సైనికులు, ఐరోపా అంతటా ఉన్న హోటళ్లు, కార్యాలయాలకు తరలివెళ్లి, దూరంగా ఉంటూనే యుద్ధంలో పాల్గొంటున్నారని మాకు సమాచారం ఉంది. మేం వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తాం. ముందుగానే మీకు చెబుతున్నాం. అమెరికా సైనికులకు గల్ఫ్ దేశాల్లోని హోటళ్లలో ఆతిథ్యం ఇవ్వొద్దు. కాని పక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని ఇరాన్ స్పష్టం చేసింది.



