Saturday, March 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅమెరికా స్థావరాలపై ఇరాన్‌ భారీ దాడులు

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ భారీ దాడులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదాబాద్: గల్ఫ్ దేశాలపై ఇరాన్‌ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. తాజాగా సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై టెహ్రాన్‌ క్షిపణులతో విరుచుకుపడింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌పై జరిగిన దాడిలో అనేకమంది అమెరికా సైనికులు గాయపడగా, యుద్ధ విమానాలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని రియాద్‌పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. టెహ్రాన్ దాడుల్లో కువైట్‌లోని పలు వాణిజ్య భవనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -