నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు నిరాశ కలిగించే వార్త. దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ గాయం కారణంగా టోర్నమెంట్‌లోని రెండు వారాలకు దూరమయ్యాడు. పిక్క కండరాల నొప్పితో బాధపడుతున్న ధోనీకి విశ్రాంతి అవసరమని, ప్రస్తుతం అతను రిహాబిలిటేషన్‌లో ఉన్నాడని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ 19వ ఎడిషన్ ఇవాళ ప్రారంభం కానుండగా, చెన్నై సూపర్ కింగ్స్ సోమవారం గువాహటిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందే ధోనీ దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. “ఎంఎస్ పిక్క కండరాల గాయం నుంచి కోలుకుంటున్నారు. ఫలితంగా అతను ఐపీఎల్ 2026 తొలి రెండు వారాలకు దూరమయ్యే అవకాశం ఉంది” అని సీఎస్కే ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
సీఎస్‌కేకు భారీ షాక్
- Advertisement -
- Advertisement -



