నవతెలంగాణ – హైదరాబాద్: విశాఖపట్నం నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానంలో శనివారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు అప్రమత్తమై ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 161 మంది ప్రయాణికులు ఉండగా, అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే, ఇండిగోకు చెందిన 6ఈ 579 విమానం విశాఖ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తుండగా, ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు ఇంజిన్‌లో సాంకేతిక సమస్యను పైలట్లు గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి, ప్రయారిటీ ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఉదయం 10:54 గంటల సమయంలో విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అగ్నిమాపక శకటాలను రన్‌వే వద్ద మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనపై ఇండిగో సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.
విశాఖ-ఢిల్లీ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



