Saturday, March 28, 2026
E-PAPER
Homeజాతీయంబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు: టీఎంసీ, బీజేపీల మాట‌ల యుద్ధం

బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు: టీఎంసీ, బీజేపీల మాట‌ల యుద్ధం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్, బీజేపీ విమ‌ర్శ‌లు-ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో మాట‌ల యుద్ధానికి దిగుతున్నాయి. బెంగాల్‌లోని రాణిగంజ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ స‌ర్కార్‌పై మ‌మ‌తా బెన‌ర్జీ విమ‌ర్శ‌లు గుప్పించారు. బెంగాల్‌ను నాశ‌నం చేయాల‌ని బీజేపీ చూస్తోంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌ అన‌వ‌స‌ర త‌గ‌దాల‌ను సృష్టించ‌డానికి కుట్ర‌లు చేస్తోంద‌ని ఆరోపించారు.

మ‌రో వైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్ర‌తి విమ‌ర్శ‌లు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోల్‌కతాలో బీజేపీ ‘ఛార్జ్ షీట్స‌ను ఆయ‌న‌ విడుదల చేశారు. 15 ఏళ్ల టీఎంసీ దుష్పరిపాలన, బెంగాల్‌ను ఆ పార్టీ అవినీతిమయంగా ఎలా మార్చిందనే విషయాలను ఆ ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా బెంగాల్‌లో అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు నడుస్తున్నాయని..శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు.

బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాల‌కు ఏప్రిల్ 23,24 తేదీల్లో రెండు ద‌శ‌ల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మే 4న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల‌వడ‌నున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -