- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నందిగామలోని పత్తి గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో సుమారు రూ.60 కోట్ల విలువైన పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
- Advertisement -



