- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కులంతర వివాహాలను ప్రోత్సహించడానికి, వేధింపుల చట్టం కింద సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.30 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను వివిధ జిల్లాలకు కేటాయించారు. జగిత్యాల జిల్లాకు రూ.1.75 కోట్లు, గద్వాలకు రూ.1.25 కోట్లు, మేడ్చల్ జిల్లాకు రూ.90 లక్షలు, హైదరాబాద్‌కు రూ.1.6 కోట్లు కేటాయించారు. గద్వాల, జగిత్యాల, రంగారెడ్డి జిల్లాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున కేటాయించినట్లు ఎస్సీ సంక్షేమ శాఖ తెలిపింది.
- Advertisement -



