Monday, March 30, 2026
E-PAPER
Homeసినిమాఘనంగా 'గూగుల్‌ మై ఫ్రెండ్‌' పాటల ఆవిష్కరణ

ఘనంగా ‘గూగుల్‌ మై ఫ్రెండ్‌’ పాటల ఆవిష్కరణ

- Advertisement -

ప్రణవ్‌ రావ్‌ రాణి, ప్రజక్త గైక్వాడ్‌ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గూగుల్‌ మై ఫ్రెండ్‌’. డాలర్స్‌ మీడియా అండ్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌ పై దివాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. బహు భాషల్లో పలు హిట్‌ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోవింద్‌ వరాహ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
టి. వెంకటేష్‌ రెడ్డి, బి.ప్రసన్నాంజ నేయులు సహ నిర్మాతలు. ఈ సినిమా త్వరలో తెలుగు, మరాఠీ భాషల్లో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్‌ ఆదిత్య, సాయి రాజేశ్‌, వి.సముద్ర, శైలేష్‌ కొలను, కొండా విజరు కుమార్‌ చేతుల మీదుగా ఈ చిత్ర సాంగ్స్‌ లాంచ్‌ కార్యక్రమాన్ని మేకర్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ సాయిరాజేశ్‌ మాట్లాడుతూ,’ఈ మూవీ సాంగ్స్‌, టీజర్‌, కొంత కంటెంట్‌ చూశాం. ఈ కంటెంట్‌ అంతా ప్రామిసింగ్‌గా ఉంది. ఒకేసారి తెలుగు, మరాఠీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మంచి రిలీజ్‌ కుదిరి ప్రొడ్యూసర్‌కు డబ్బులు, దర్శకుడు గోవింద్‌కి పేరు రావాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.
‘ఈ సినిమాను మా ఫ్రెండ్‌ గోవింద్‌ వరాహ రూపొందిస్తున్నారు. ఆయన బహు భాషల్లో సినిమాలు రూపొందించిన దర్శకుడు. ఆయన మరిన్ని పాన్‌ ఇండియా చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని డైరెక్టర్‌ వీఎన్‌ ఆదిత్య చెప్పారు. డైరెక్టర్‌ వి సముద్ర మాట్లాడుతూ,’మా డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ మెంబర్స్‌ సమక్షంలో సాంగ్స్‌ రిలీజ్‌ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు మంచి సక్సెస్‌ రావాలని మేమంతా బ్లెస్‌ చేస్తున్నాం’ అని చెప్పారు.
డైరెక్టర్‌ కొండా విజరు కుమార్‌ మాట్లాడుతూ,’రామానాయుడు అన్ని భాషల్లో సినిమాలు నిర్మించాలని ఎలా కంకణం కట్టుకున్నారో, గోవింద్‌ కూడా బహు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. తెలుగు, మలయాళం, ఒరిస్సా, మరాఠీ ఇలా వివిధ భాషల్లో సినిమాలు రూపొందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌ చేసిన ప్రతి భాషలోనూ విజయం సాధించాలి’ అని తెలిపారు.
‘నేను తెలుగులో ‘బాల, నేను నాన్న అబద్ధం, మనుషులతో జాగ్రత్త’ వంటి చిత్రాలు రూపొందించాను. మలయాళంలో కొన్ని చిత్రాలు రూపొందించాను. మరాఠీలో ఓ సినిమా తెరకెక్కించాను. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. తెలుగు డైరెక్టర్స్‌ అసోసియేషన్‌కు ఎన్నికైన నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు మా మూవీ సాంగ్స్‌ రిలీజ్‌ చేసుకోవడం అదష్టంగా భావిస్తున్నా. మా నిర్మాతలు ఇస్తున్న సపోర్ట్‌ వల్లే వరుసగా సినిమాలు చేయగలుగుతున్నాను. ఈ జర్నీలో నాకు సపోర్ట్‌ చేస్తున్న నిర్మాతలు ఏఎం రత్నం, కెకె రాధమోహన్‌, చిట్టూరి శ్రీనివాస్‌కి థ్యాంక్స్‌ చెబుతున్నా’ అని డైరెక్టర్‌ గోవింద్‌ వరాహ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -