Monday, March 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌కు 'బండారి రాజిరెడ్డి' పేరు

ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌కు ‘బండారి రాజిరెడ్డి’ పేరు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్‌కు ‘బండారి రాజిరెడ్డి కారిడార్‌’గా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప్పల్ నియోజకవర్గానికి బండారి రాజిరెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదన మేరకు, ఫిబ్రవరి 9న ప్రభుత్వానికి నివేదించగా, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -