Monday, March 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజీహెచ్‌ఎంసీపై కాగ్‌ కీలక ఆరోపణలు

జీహెచ్‌ఎంసీపై కాగ్‌ కీలక ఆరోపణలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: మార్చి 2022తో ముగిసిన ఏడాదికి సంబంధించి కాగ్‌ నివేదికను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జీహెచ్‌ఎంసీపై కాగ్‌ కీలక ఆరోపణలు చేసింది. ప్రాసెస్‌ చేయని చెత్తకు రూ.313.20 కోట్ల చెల్లింపులు జరిగాయని పేర్కొంది. డ్రైవేస్ట్‌ ప్రాసెసింగ్‌ జరగకపోయినా.. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారని నివేదికలో తెలిపింది. యూజర్‌ ఛార్జీల సేకరణపై సమీక్ష లేదని చెప్పింది. తెలంగాణలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా, వాటిలో 16 సంస్థలు ఇప్పటికే మూతపడటం లేదా లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్నాయి. మిగిలిన 67 సంస్థల్లో ఏకంగా 49 సంస్థలు తమ వార్షిక ఖాతాలను సమర్పించడంలో జాప్యం చేశాయి. కేవలం 18 సంస్థలు మాత్రమే ఆడిటింగ్‌కు సహకరించగా, వాటి పనితీరును విశ్లేషించిన కాగ్ దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. విశ్లేషణకు తీసుకున్న 18 సంస్థల్లో కేవలం 6 సంస్థలు మాత్రమే లాభాల్లో ఉండగా, 11 సంస్థలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. 9 సంస్థల నెట్ వర్త్ నష్టాల కారణంగా పూర్తిగా కరిగిపోయింది. మొత్తం మీద ఈ సంస్థల నెట్ వర్త్ -₹50,930 కోట్లకు పడిపోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -