Monday, March 30, 2026
E-PAPER
Homeక్రైమ్భర్త గ్యాస్ తేలేదని..భార్య ఆత్మహత్యాయత్నం

భర్త గ్యాస్ తేలేదని..భార్య ఆత్మహత్యాయత్నం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురావడం లేదని మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలంలో చోటు చేసుకుంది. తొండపాడులో హరికృష్ణ, మహాలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. ఇంట్లో గ్యాస్ అయిపోయిందని, సిలిండర్ తేవాలని మహాలక్ష్మి 3 నెలలుగా చెబుతోంది. డబ్బులు లేవన్న కారణంతో అతను సిలిండర్ తీసుకురాలేదు. తాను ఎంత చెప్పినా భర్త మాట వినకపోవడంతో ఇంట్లో ఫినాయిల్ తాగి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -