Monday, March 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫీజుల పెంపుదలపై విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన..

ఫీజుల పెంపుదలపై విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన..

- Advertisement -



న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు పెంచడంపై ఆందోళన చేప‌ట్టారు. సోమవారం ఉదయం పాఠశాల ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి యేటా 15% ఫీజులు పెంచడం, మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా పాఠశాల యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల తల్లిదండ్రులపై విపరీతమైన భారం పడుతుందని వారు తెలిపారు. ఐదవ తరగతి నుండి ఆరవ తరగతి విద్యార్థులకు 35% ఫీజు పెంపుదల అన్యాయమని పేర్కొన్నారు. ఒకపక్క ప్రభుత్వం ఫీజు నియంత్రణపై చట్టాలు తీసుకువచ్చే కృషి చేస్తుండగా విద్యాశాఖ ఉన్నతాధికారులు బాధ్యులుగా ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇష్టానుసారంగా ఫీజులు పెంచడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఫీజుల పెంపుదలను ఉపసంహరించాలని, విద్యార్థులకు అన్ని రకాల ఆటల పోటీలలో నైపుణ్యాలు పెంచే కృషి చేయాలని దానికి అదనపు ఫీజులు వసూలు చేయకూడదని విన్నవించారు. ఫీజుల పెంపుదల మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, తల్లిదండ్రులకు భారం పడే విధంగా కాకుండా ఉంటే తల్లిదండ్రులు కూడా సహకరిస్తారని పేర్కొన్నారు. స్కూల్లో వసూలు చేసే ఫీజులు నిబంధనల ప్రకారం వివరాలు అందజేయాలని, పెంచే ఫీజులకు సరైన పద్ధతులు, విధానాలు ఉండాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో టీచర్లు, యాజమాన్యం సమన్వయం చేసుకోవడానికి పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తల్లిదండ్రుల తరఫున ప్రిన్సిపాల్‌కు వినతి పత్రం అందజేశారు.
స్పందించిన ప్రిన్సిపల్
ప్రభుత్వ అధికారుల సమన్వయంతో నడుస్తున్న పాఠశాలలో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేదని అన్ని నిబంధనల మేరకు అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో ఫీజుల విషయాన్ని సొసైటీ దృష్టికి తీసుకువెళ్లి తగిన విధంగా నిర్ణయం తీసుకోవడంలో కృషి చేస్తానని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -