Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యమ కారుల ఫోరం జిల్లా నాయకుల అరెస్టు

ఉద్యమ కారుల ఫోరం జిల్లా నాయకుల అరెస్టు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల ఫోరం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు యాదండ్ల గట్టయ్య యాదవ్, ప్రదాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్ ను సోమవారం కొయ్యురు పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మానిఫేస్టోలో పెట్టిన హమీలు నెరవేర్చాలని ఉద్యమ కారులను గుర్తించేందుకు వెంటనే సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యమ కారులకు పెన్షన్లు, 250 గజాల ఇంటి స్థలం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ట్రైన్, బస్ పాస్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల అరెస్టు ను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమ కారుల పట్ల ప్రభుత్వం నిర్బంధాలు మానుకొని సానుకులంగా స్పందించి ఉద్యమకారులకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -