Tuesday, March 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలు ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

 ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లు – 2026కు సభ ఆమోదం తెలిపిన అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.

ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం 10 రోజుల పాటు జరిగాయి. ఈ సెషన్‌లో సభా కార్యకలాపాలు మొత్తం 82 గంటల 47 నిమిషాల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 11 బిల్లులను ప్రవేశపెట్టగా, వాటిలో 10 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. మరొక బిల్లును తదుపరి పరిశీలన నిమిత్తం సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు.

ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు, ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ బిల్లు – 2026, అడ్వకేట్ల పరిరక్షణ బిల్లు – 2026 వంటి కీలక బిల్లులకు కూడా సభ ఆమోదముద్ర వేసింది. వీటితో పాటు మూడు ప్రభుత్వ తీర్మానాలను కూడా ఆమోదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -