Tuesday, March 31, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకువైట్‌ చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ భీకర దాడి..!

కువైట్‌ చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ భీకర దాడి..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ తన దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా కువైట్‌కు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై భీకర దాడి చేసింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. కువైట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఓ ప్రకటనలో ఈ ఘటనను ధ్రువీకరించింది

కువైట్‌కు చెందిన ‘అల్‌ సల్మీ’ అనే భారీ ముడిచమురు నౌక దుబాయ్‌ పోర్టు వద్ద ఉంది. దీనిపై ఇరాన్‌ డ్రోన్‌తో దాడి చేయగా.. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. వీటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటన తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. 24 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధ్రువీకరించారు. అయితే, దాడి సమయంలో ట్యాంకర్‌ నిండా చమురు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అది సముద్రంలో ఒలికిపోయే ప్రమాదం ఉందని కువైట్‌ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. జలాల్లో చమురు ఒలికే ప్రమాదం ఉందని కువైట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ఘటనను దుబాయ్‌ అధికారులు కూడా ధ్రువీకరించారు. రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -