- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ ఆసియాలోని యుద్ధ వాతావరణం కారణంగా భారత ఫార్మా రంగం ఎఫెక్ట్ అవుతోంది. బల్క్ డ్రగ్స్, APIs సరఫరాలో అంతరాయాలు ఏర్పడడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. కొన్ని కీలక ముడి పదార్థాల ధరలు 200–300% పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్లిజరిన్ 64%, పారాసెటమాల్ 25%, సిప్రోఫ్లోక్సాసిన్ 30% పెరిగాయి. ప్యాకేజింగ్ పదార్థాల ఖర్చులు కూడా 40% వరకు పెరిగాయి. కేంద్రం సరైన చర్యలు తీసుకోకపోతే సామాన్యులపై భారం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Advertisement -



