- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉపాధి హామీ పనుల్లో ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గ్రౌండ్ లెవెల్లో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట వేయడమే దీని లక్ష్యం. మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా కూలీల అటెండెన్స్‌ను మానిటర్ చేయనుంది. ఈ నెల 2 నుంచే కమ్యూనిటీ పనులకు ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. త్వరలో వ్యక్తిగత లబ్ధిదారుల పనులకూ వర్తింపజేయనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సర్క్యులర్ జారీ చేసింది.
- Advertisement -



