- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. విజయవాడ బస్టాండ్ ఎదుట ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్‌కు చెందిన బస్సు విజయవాడ బస్టాండ్ సమీపానికి చేరుకున్న సమయంలోనే మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
- Advertisement -



