Tuesday, March 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుడేటా గోపిక కాపాడడంతోపాటు అనైతిక డేట్ అఫ్ పద్ధతులను వెంటనే అరికట్టాలి..

డేటా గోపిక కాపాడడంతోపాటు అనైతిక డేట్ అఫ్ పద్ధతులను వెంటనే అరికట్టాలి..

- Advertisement -

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ :  డిజిటల్ యుగంలో డేటా గోప్యతను కాపాడటంతో పాటు అనైతిక డేటా పద్దతులను వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉం దని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమవారం గన్ఫండ్రీలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ కళాశాలలో బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ గవర్నెన్స్ సుస్ధిరతపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పలువురు ప్రముఖ విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు పాల్గొని, సాంకేతిక పురోగతి, నైతిక బాధ్యతల మధ్య పెరుగుతున్న సంబంధంపై ప్రసంగిస్తూ, డిజిటల్ పరివర్తనను సుస్ధిరత, నైతిక పాలనతో మేళవించాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం ప్రాధాన్యతను ఈ సదస్సులో ప్రధానాంశం గా నిలిచింది. ప్రధాన వక్తలు అమిత్ కుమార్ సోని, శ్రీదుర్గా ప్రసాద్ ‘ఏఐ పారడాక్స్’ అనే అంశంపై మాట్లాడుతూ సాంకేతికత వాయువేగంతో అభి వృద్ది చెందుతున్న ప్పటికీ, మానవ అనుకూలతను మించిపోతున్నప్పటికీ దానిని బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని అన్నారు. విమర్శనాత్మక ఆలోచన, భావోద్వే గ మేధస్సు దెబ్బ తీయకుండా, కృత్రిమ మేధస్సు, మానవ సామర్థ్యాలకు అనుగుణంగా ఉండాలన్నారు. విద్యావేత్తలైన ఫ్రొఫెసర్ డి శ్రీరాములు, ఫ్రొఫెసర్ గుణశేఖర్లు మాట్లాడుతూ విద్యారంగంలో దార్శనికతతో కూడిన నాయకత్వం పాత్రపై విలువులైన సూచనలు చేశారు. వి విద్యార్థుల భవిష్యత్తుగా సిద్ధం గా ఉంటే నైపుణ్యాలను అందించేందుకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బీబీఏ వంటి ప్రత్యేక కార్యక్రమాలు ప్రవేశపెట్టాల ని వారు సూచించారు. ఫాదర్ బాలశౌరి, ఫ్రొఫెసర్ ఎస్ ఎస్ ప్రసాద్ రావులు ప్రసంగిస్తూ పరిశోధన = ఆధారిత ఫలితాల ప్రాముఖ్యతను వివరిస్తూ, కేవలం విద్యాపరమైన విజయంపై కాకుండా అర్ధవంతమైన ప్రభావంపై దృష్టి పెట్టాలని సంస్థలకు, విద్యార్థులకు సూచించారు. సుస్ధిర ఫ్యాషన్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలతో స హా, పరిశ్రమలన్నింటిలో పర్యావరణ అనుకూల ఆవిష్కరణలు, సుస్ధిర పద్ధతుల ఆవశశ్యకతను ప్రముఖంగా ప్ర స్తావించారు. సమావేశపు కార్యకలాపాల ను అధికారికంగా విడుదల చేయడంలో సదస్సు ముగిసింది. అనంతరం విశిష్ట అతిథులను, సహకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎఈ ఎస్ ఛైర్మెన్ పూల ఆంటోనీ, కళాశాల ప్రిన్సిపల్ ఆంటోనీ సగయరాజా, కళాశాల బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం అధ్యాపకులు డాక్టర్ నాగునూరి శ్రీని వాస్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -