నవతెలంగాణ-హైదరాబాద్: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఓట్ల హాకింగ్‌కు పాల్పడుతుందని ఎన్నికల సంఘానికి(ఈసీ) లేఖ రాసింది. పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాన్ని, బెంగాల్ ఓటర్ల జాబితాలోకి నివాసితులు కానివారిని, బయటివారిని అక్రమంగా చేర్పించేందుకు వేలాది నకిలీ ఫారం-6 దరఖాస్తులతో నింపేస్తున్న బీజేపీ ఏజెంట్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని ఆరోపించారు
లోపభూయిష్టమైన SIR ప్రక్రియ ప్రకారం 60 లక్షలకు పైగా నిజమైన ఓటర్ల దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉండగా, నకిలీ దరఖాస్తులను రహస్యంగా విచారించడానికి బీజేపీ కుట్రలు పన్నుతుందని లేఖలో పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం మాత్రమే కాకుండా, బెంగాల్లో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలపై ప్రత్యక్ష దాడి అని ఆందోళన వ్యక్తం చేశారు.
“బీహార్, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలలో ఎన్నికలకు ముందు కూడా ఈ తరహా పోకడలే కనిపించయని, ఈ నిర్ణయాలు, ప్రక్రియలు రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నాయని, ఈ చర్యలను వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకోవాలని ఆమె లేఖలో పేర్కొంది.



