Wednesday, April 1, 2026
E-PAPER
Homeజాతీయంఏపీ రాజ‌ధానిగా అమరావతికి చట్టబద్ధత

ఏపీ రాజ‌ధానిగా అమరావతికి చట్టబద్ధత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. అమరావతి బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈరోజు(బుధవారం) ఉదయం అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో ఎంపీలు పాల్గొన్నారు. చర్చ తర్వాత అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -