Wednesday, April 1, 2026
E-PAPER
Homeజాతీయంకేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఎక్సైజ్ పాలసీ కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) బుధవారంనాడు నోటీసులు పంపింది. ఎక్సైజ్ పాలసీ కేసులో సమన్లు జారీ చేసినప్పటికీ కేజ్రీవాల్ హాజరుకాలేదంటూ ఈడీ నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో ఆయనను రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల నిర్దోషిగా ప్రకటించింది. దీనిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేజ్రీవాల్‌కు తాజాగా నోటీసులు పంపింది. తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 27న మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌పై విచారణకు తగిన ఆధారాలు లేవంటూ విచారణ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. కేజ్రీవాల్‌తో పాటు సిసోడియా, మరో 21 మందిని లిక్కర్ పాలసీ కేసులో నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ కూడా ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -