Thursday, April 2, 2026
E-PAPER
Homeసినిమాఈటీవీ విన్‌లో'యుఫోరియా'

ఈటీవీ విన్‌లో’యుఫోరియా’

- Advertisement -

గుణ శేఖర్‌ దర్శకత్వంలో భూమిక, సారా అర్జున్‌ ప్రధాన పాత్రలలో నాజర్‌, రోహిత్‌, విఘ్నేశ్‌ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’.
రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్త గుణ నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది.
నేటి (గురువారం) నుంచి ఈటీవి విన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రీ స్ట్రీమింగ్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు.
డైరెక్టర్‌ గుణశేఖర్‌ మాట్లాడుతూ,’అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నా కెరీర్‌ రామోజీ రావు ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థలోనే ప్రారంభమైంది. నేను బాగా పని చేస్తున్నానని ఆయన నన్ను ప్రోత్సహించారు. ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రతిష్టాత్మక అవార్డులు ఇచ్చింది. ఉత్తమ కథా రచ యితగా నన్ను, ఉత్తమ సహాయనటిగా భూమికని గౌరవించింది. అంత కంటే పెద్ద గుర్తింపు ఈ రోజు ఈటీవీ విన్‌ ఇచ్చింది. ఈటీవీ విన్‌లో ఈ సినిమా విడుదల కావడం నాకు చాలా గర్వంగా ఉంది. నిజానికి ఓటీటీ వాళ్లు కంటెంట్‌ను బోల్డ్‌గా చెప్పడానికి ప్రోత్సహిస్తారు. కానీ అలాంటి సంస్థలే ఈ కథ షాకింగ్‌గా ఉందని వెనకడుగు వేశాయి. నితిన్‌ చెప్పినట్టు, ‘బోల్డ్‌’ అంటే విజువల్‌గా కాదు, కంటెంట్‌ రూపంలో చెప్పేది. ఈటీవీ కథల ద్వారా సమాజానికి అద్దం పట్టే సినిమాలను తీయడంలో ముందుంది. ”కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌” అని ప్రేక్షకులు అంటున్నారు. అలాంటి కంటెంట్‌తో సినిమా తీసినప్పుడు ప్రేక్షకులు కూడా థియేటర్‌కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. కానీ చాలా మంది ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందో అడిగారు. ఇది థియేటర్‌ కోసం తీసిన సినిమా. ప్రేక్షకులు థియేటర్‌లో చూడాల్సిన సినిమా’ అని తెలిపారు.

మంచి కథలను తీసే దర్శకులను ఎంక రేజ్‌ చేయండి. ఆడియన్స్‌ని కూడా తప్పుపట్టలేం. సినిమాలను ఓటీటీ ప్రభావితం చేసింది. మూడు వారాల్లో సినిమా ఓటీటీలోకి రావ డంతో, పెద్ద సినిమాలు థియేటర్‌లో, కంటెంట్‌ సినిమాలు ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు ఫిక్స్‌ అయ్యారు.
కనీసం మూడు నెలలు ఓటీటీలోకి సినిమా రాకూడదు. అప్పుడే సినిమా బతుకుతుంది. థియేటర్‌లో సినిమా బాగా ఆడాలి అంటే ఈ గ్యాప్‌ అవ సరం. ప్రేక్షకులు, పరిశ్రమ అందరూ కలిసి థియేటర్లను కాపాడాలి.
– దర్శకుడు గుణశేఖర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -