- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. దేవాలయం ఎదురుగా ఉన్న జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దేవాలయ గెస్ట్ హౌస్లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జనరేటర్ కాలిపోవడం, దట్టమైన పొగలు రావడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు.
- Advertisement -



