నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. డీఎంకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు గురువారం పార్టీ అనుచరులతో కలిసి ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. అదే విధంగా టీవీకే అధినేత విజయన్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. తిరుచ్చి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు నామినేషన్ దాఖలు చేశారు. మార్చి 30న పెరంబూర్ నుంచి పోటీ చేయనున్నట్లు నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దఫాలో పోలింగ్ నిర్వహించనున్నారు. మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఉదయనిధి స్టాలిన్, విజయన్ నామినేషన్ దాఖలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



