- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామంలోని జంబీ హనుమాన్, అభయాంజనేయ స్వామి వారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఆలయ పూజారులు స్వామి వారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆంజనేయస్వామిని వేడుకున్నట్లు ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
- Advertisement -



