నవతెలంగాణ-బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తి నచ్చరాజు వెంకట శ్రావణ్ కుమార్ గురువారం స్వగ్రామం మండల పరిధిలోని గుగ్గీళ్ళలో శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన తల్లి నచ్చరాజు శారద దేవి శ్రీ రంగనాయక స్వామి ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. తహసీల్దార్ శ్రీకాంత్ న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దేవాదాయ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ రామాల సునీత, అసిస్టెంట్ కమిషనర్ మెదక్ ఇంచార్జ్ రంగారెడ్డి, సిద్దిపేట్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి,ఈవో కిషన్ రావు తదితరులు అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర న్యాయమూర్తి పర్యటన…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



