Thursday, April 2, 2026
E-PAPER
Homeమహబూబ్ నగర్గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు..

గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు..

- Advertisement -
  • ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళికలు
    నవతెలంగాణ-ఊరుకొండ:
    గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకే అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించినట్లు ఆయా గ్రామాల సర్పంచులు, మండల అధికారులు తెలిపారు. గురువారం ఊరుకొండ మండల కేంద్రం తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు కార్యక్రమాన్ని ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమం, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక, గ్రామ అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల గురించి గ్రామ ప్రజలకు వివరించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని గ్రామ ప్రజలను కోరారు. గ్రామసభ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉప సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, మండలంలోని వివిధ శాఖల అధికారులు, వార్డ్ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘ సభ్యులు, యువకులు మరియు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -