- Advertisement -
నవతెలంగాణ-నెల్లికుదురు: మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రత్యేక అధికారులు ఆయా గ్రామాల సర్పంచ్లతో కలిసి పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో గ్రామాల అభివృద్ధి చదివించే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామంలో ఎంతమందికి చేరాయి, ఇంకా గ్రామాలకు చేసిన అభివృద్ధి పనులను గ్రామసభలో చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు. సౌల్ల తండ గ్రామపంచాయతీ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో గ్రామ సభ నిర్వహించడం జరిగింది.
- Advertisement -



