నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్-19లో భాగంగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. నిర్ణిత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతాకు 227 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టు ఆరంభం నుంచి ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (46), అభిషెక్ శర్మ (48) దూకుడుగా ఆడారు. విరిద్దరు అవుట్ అయ్యాకా క్లాసెన్ (52) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నితీష్ కుమార్ (39) పరుగులు చేయడంతో 226 పరుగులు చేయగలిగింది.
కోల్‌కతా బౌలర్లలో మూజార్‌బాని నాలుగు వికెట్లు తీయగా వైభవ్ ఆరోరా రెండు వికెట్లు తీశాడు. కార్తిక్ త్యాగి, అనుకుల్ రాయ్ చెరో వికెట్ తీసుకున్నారు.



