నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని పబ్‌లలో డ్రగ్స్ కల్చర్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా కొండాపూర్‌లోని ‘క్వాక్ ఏరీనా పబ్’పై ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. పార్టీ జరుగుతున్న సమయంలో ఆకస్మికంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, అక్కడ ఉన్న సుమారు 64 మందికి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 8 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో ఆరుగురు గంజాయి, మరో ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ పార్టీలో పాల్గొన్న టాలీవుడ్ నటి హేమ, తనకు నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని, తాను ఏ తప్పూ చేయలేదని సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.
పబ్‌లో డ్రగ్స్ కలకలం.. 8 మందికి పాజిటివ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



