నవతెలంగాణ – హైదరాబాద్ : ఈరోజు కువైట్ లోని చమురుశుద్ధి కర్మాగారం మీనా అల్-అహ్మదిపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఆ ప్రాంతంలో భారీఎత్తున మంటలు చెలరేగినట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారని పేర్కొంది. ఈ దాడిలొ ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది. మీనా అల్-అహ్మది కర్మాగారం నుంచి రోజుకు 3,46,000 బ్యారెళ్ల చమురును ఉత్ప చేస్తారు. దాదాపు లక్షల బ్యారెళ్ల మేర డీజిల్, ఇతర శుద్ధి చేసిన ఇంధనాలను ఆసియా, యూరప్లోని మార్కెట్లకు ఎగుమతి చేస్తూ.. ప్రభుత్వానికి కీలకమైన ఆదాయ వనరుగా నిలుస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో మీనా అల్-అహ్మది ఒకటి. కువైట్ చమురు ఉత్పత్తికి ఇది చాలా కీలకం.
కువైట్ లోని చమురుశుద్ధి కర్మాగారం ఇరాన్ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



