- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇరాన్ దేశంపై భీకరంగా యుద్ధం నడుస్తుంది. గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టనుంది. ఇప్పటికే 3 వేల మంది అమెరికా సైన్యం ఇరాన్ లో గ్రౌండ్ ఆపరేషన్ కోసం గల్ఫ్ దేశాలకు చేరుకున్నాయి. యుద్ధం మధ్యలో.. అమెరికా ఆర్మీ చీఫ్ రాండీ ఏ జార్జ్ ను మధ్యంతరంగా తొలగించటం చర్చనీయాంశం అయ్యింది. ఇరాన్తో భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా నిర్ణయం షాకింగ్ కు గురిచేస్తోంది. యూఎస్ ఆర్మీ చీఫ్ పై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. యూఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని రక్షణ శాఖా కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ ఆదేశించారు. ఆర్మీ చీఫ్ ను రిటైర్ కావాలని హెగ్ సెత్ ఆదేశించిన విషయాన్ని పెంటగాన్ ధృవీకరించింది.
- Advertisement -



