Friday, April 3, 2026
E-PAPER
Homeజాతీయంఎన్నిక‌ల విధుల అధికారుల‌కు ఈసీ తీపిక‌బురు

ఎన్నిక‌ల విధుల అధికారుల‌కు ఈసీ తీపిక‌బురు

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్: ఇటీవ‌ల ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసి పోలింగ్ తేదీల‌ను వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. కేర‌ళ‌, అసోం, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్, పుదుచ్చేది రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. కేర‌ళ‌, అసోంలో ఏప్రిల్ 9న‌, త‌మిళ‌నాడులో ఏప్రిల్ 23 జ‌ర‌గ‌నుండ‌గా, బెంగాల్‌లో రెండు ద‌ఫాలుగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఏప్రిల్ 23,29 తేదీల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మే 4న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. అదే విధంగా ప‌లు రాష్ట్రాల్లో ఓట‌ర్ జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ కూడా ముమ్మ‌రంగా సాగుతోంది.

ఈక్ర‌మంలోనే ఈసీ ఎన్నిక‌ల విధుల అధికారుల‌కు తీపి క‌బురు చెప్పింది. గుడ్ ఫ్రైడే నేప‌థ్యంలో వేత‌నంతో కూడిన సెలవులు మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన్న అన్ని స్థాయిల ఉద్యోగుల‌కు వ‌ర్తిస్తుంద‌ని ఈసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -