నవతెలంగాణ-హైదరాబాద్: సర్ ప్రక్రియలో నేపథ్యంలో మాల్దాలో పలువురు న్యాయాధికారులను నిర్భందించిన సంఘటన బెంగాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే 35మందిని అదుపులోకి తీసుకున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. తాజాగా ఘటనకు సంబంధించి అసలు సూత్రాధారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని పేరు మోఫాక్కెరుల్ ఇస్లాం. వృత్తిరీత్యా న్యాయవాది. ఇట్టహార్ నివాసి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు.‘బాగ్డోగ్రా విమానాశ్రయంలో సదురు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఉత్తర బెంగాల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ కె. జయరామన్ మీడియాకు వెల్లడించారు.
కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేయమని ఎన్నికల సంఘం ఎన్ఐఎ (జాతీయ దర్యాప్తు సంస్థ)ను కోరింది. ఇక ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సిబిఐ లేదా ఎన్‌ఐఎతో దర్యాప్తు జరిపించమని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో బుధవారం సాయంత్రం ఏడుగురు జ్యుడిషియల్ అధికారులను నిరసనకారులు చుట్టుముట్టారు. న్యాయ నిర్ణయ పని నిమిత్తం కాలియాచక్కు వెళ్లిన ఏడుగురు అధికారులను మాల్దాలోని కాలియాచక్ బ్లాక్ 11 వద్ద నిరసనకారులు కొన్నిగంటల పాటు ఘెరావ్ చేశారు. ఈ ఘటనపై 35 మందిని అరెస్టు చేశాం. 19 కేసులు నమోదు చేశాం’ అని అన్నారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంది. అయితే వారు హింసకు పాల్పడకూడదని జయరామన్ అన్నారు.



