Saturday, April 4, 2026
E-PAPER
Homeసినిమా'రాకాస'కిఅద్భుతమైన రెస్పాన్స్‌

‘రాకాస’కిఅద్భుతమైన రెస్పాన్స్‌

- Advertisement -

జీ స్టూడియోస్‌ సమర్పణలో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఉమేష్‌ కుమార్‌ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల ‘రాకాస’ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంగీత్‌ శోభన్‌, నయన్‌ సారిక జంటగా నటించారు.
ఈ చిత్రాన్ని ఈనెల 3న రిలీజ్‌ చేశారు. అన్ని చోట్లా ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో శుక్రవారం చిత్రయూనిట్‌ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ,’మూవీని ఆడియెన్స్‌తో పాటు చూశాం. ప్రీమియర్ల నుంచే మా సినిమాకి మంచి రెస్పాన్స్‌ దక్కింది. మేం ఎక్కడైతే ఆడియెన్స్‌ ఎక్కువగా నవ్వుతారు, ఎంజారు చేస్తారని అనుకున్నామో అక్కడ అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోంది. ఎంటర్టైన్మెంట్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో తీసిన మా సినిమాని చూసి ఆడియెన్స్‌ ఎంజారు చేస్తున్నారు. విడుదలైన ప్రతీ చోటా మా చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది’ అని అన్నారు. ‘ప్రీమియర్ల నుంచే మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ రోజు కూడా అంతే స్థాయిలో ఆదరణ దక్కుతోంది. పిల్లలతో సహా పేరెంట్స్‌ ఈ మూవీకి వస్తున్నారు. మా మూవీని ఎంకరేజ్‌ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్‌’ అని సంగీత్‌ శోభన్‌ చెప్పారు.
నయన్‌ సారిక మాట్లాడుతూ, ‘అన్ని చోట్లా హౌస్‌ ఫుల్స్‌ పడ్డాయి. ఈ సక్సెస్‌ చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ‘థియేటర్లో వస్తున్న రెస్పాన్స్‌ చూసి హ్యాపీగా ఫీలవుతున్నాను’ అని దర్శకురాలు మానస శర్మ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -