- Advertisement -
నవతెలంగాణ నాసిక్: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్టిగా కారు అదుపుతప్పి బావిలో పడటంతో ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతిచెందారు. వీరిలో ఆరుగురు చిన్నారులున్నారు. ఓ ప్రయివేట్ ట్యూషన్ క్లాస్ రీయూనియన్ వేడుకకు వెళ్లి వస్తుండగా శుక్రవారం రాత్రి నాసిక్ జిల్లా దిండోరి వద్ద ఈ ఘటన జరిగింది. మృతి చెందినవారిలో దంపతులు సునీల్ దత్తు (32), రేష్మా (32)తో పాటు 7–14 ఏండ్ల మధ్య ఉన్న ఐదుగురు ఆడపిల్లలు, 11 ఏండ్ల అబ్బాయి ఉన్నారు.
- Advertisement -



