నవతెలంగాణ – హైదరాబాద్ : దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. హైడ్రామా మధ్య ఈ రెండు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్‌గా టేకుల సుదర్శన్‌రెడ్డి… వైస్ ఛైర్మన్‌గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు.
మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకట స్వామి నియోజకవర్గం చెన్నూరులోని క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్- సీపీఐ కూటమి వశమైంది. ఛైర్మన్ పదవికి శనివారం జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిసల సంధ్యారాణి విజయం సాధించారు. మెజారిటీ కౌన్సిలర్లు ఆమెకు మద్దతు తెలిపారు. వైస్ చైర్మన్ పదవి కూడా బీఆర్ఎస్ మద్దతుతో సీపీఐ గెలుచుకుంది. ఆ పార్టీ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.



