Saturday, April 4, 2026
E-PAPER
Homeజాతీయంఅబ్బే..నేనే పోటీ చేయ‌ట్లే: అన్నామలై

అబ్బే..నేనే పోటీ చేయ‌ట్లే: అన్నామలై

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: గురువారం త‌మిళ‌నాడులో 27మందితో బీజేపీ అభ్యర్థుల లిస్ట్ విడుదల అయింది. అయితే ఈ జాబితాలో మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేరు లేకపోవడంతో రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఈ వదంతులపై అన్నామలై క్లారిటీ ఇచ్చారు. కోయంబత్తూరు నుంచి చెన్నైకి వచ్చిన అన్నామలై.. విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. తానే స్వయంగా పోటీ చేయాలనుకోవడం లేదని.. ఈ ఎన్నికల్లో చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందుకే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని క్లారిటీ ఇచ్చారు. ఇకపై తాను ఎన్డీఏ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -