Saturday, April 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం‘బుషెహర్’పై దాడి..ఒక‌రు మృతి

‘బుషెహర్’పై దాడి..ఒక‌రు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇరాన్‌లో శనివారం (ఏప్రిల్‌ 4న) ఉదయం బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం పరిధి సమీపంలో ఒక క్షిపణి పడింది. ఒక భద్రతా సిబ్బంది మరణించినట్లు ఇరానియన్ వార్త సంస్థ తస్నీమ్ తెలిపింది. ఈ ఘటనలో అణు విద్యుత్‌ కేంద్రం ప్రధాన భాగాలు దెబ్బతినలేదు. కానీ, సహాయక భవనం దెబ్బతింది. అణు విద్యుత్ కేంద్రం ఉత్పత్తిపై ప్రభావం పడలేదు.

ఇవాళ ఉదయం ఇరాన్ సాయుధ దళాల కేంద్ర ప్రధాన కార్యాలయం.. అమెరికా, పశ్చిమాసియాలోని దేశాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఖాతమ్ అల్-అన్బియా కేంద్ర కార్యాలయం ప్రతినిధి ఇబ్రాహీం జోల్ఫఘారి ఓ ప్రకటన విడుదల చేసి.. అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులపై వినాశకర దాడులు చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -