నవతెలంగాణ – కుభీర్
గ్రామాల్లో వేసవితో ప్రజలకు నీటి సమస్య తీవ్రంగా వెంటాడుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలంలోని డోడర్నా గ్రామస్తులు ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కు నీటి సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తన నిధులతో శనివారం మండల నాయకులతో కలిసి నూతన బోరు వేయించి, ప్రారంభించారు. ఎమ్మెల్యే కృషితో గ్రామస్తులకు త్రాగునీటి సమస్యను పరిష్కరించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటానని అన్నారు. ముఖ్యంగా వేసవికాలంలో గ్రామాల్లో త్రాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాథోడ్, శంకర్, సాయినాథ్, ఇన్కమ్ టాక్స్ అధికారి రాథోడ్ ప్రకాష్, అజయ్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.



