Sunday, April 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమానత్వానికి ప్రతీక బాబు జగ్జీవన్‌ రామ్‌

సమానత్వానికి ప్రతీక బాబు జగ్జీవన్‌ రామ్‌

- Advertisement -

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సమానత్వానికి ప్రతీక, సామాజిక న్యాయానికి చిరునామా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ నివాళులర్పించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ రాజకీయాల్లో అజరామరమైన ముద్ర వేసిన మహానేత బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని తెలిపారు. ఆయన చూపిన మార్గం మనకు మార్గదర్శకమనీ, సమాన హక్కులు, సమగ్ర అభివద్ధి లక్ష్యంగా ప్రయాణం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఆయన ఆలోచనలను స్మరించుకుంటూ, సమానత్వ సమాజ నిర్మాణానికి సంకల్పిద్దామని సూచించారు.
ఈస్టర్‌ శుభాకాంక్షలు
ప్రేమ, శాంతికీ, పునరుత్థానానికి ప్రతీక అయిన ఈస్టర్‌ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ హదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని మంచితనాన్ని మేల్కొలిపే ఈస్టర్‌ సందేశం ప్రేమ, క్షమ, సేవాభావానికి నిలువెత్తు నిదర్శనమని యేసుక్రీస్తు త్యాగం మనం దరికీ స్ఫూర్తి అని తెలిపారు. ఈ పవిత్ర సందర్భంలో ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి నిండాలనీ, సమాజంలో ఐక్యత, సహోదరభావం మరింత పెరగాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -