- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు(గురువారం) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
- Advertisement -



