- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా సోఝా సమీపంలో శనివారం రాత్రి 22 మందితో వెళ్తున్న ఓ ట్రావెలర్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా, 18 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను బంజార్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక, ఆరోగ్య శాఖలు స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
- Advertisement -



