Sunday, April 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంటెహ్రాన్‌పై అమెరికా భీకర దాడులు..ఇరాన్‌ సైనిక నాయకులు హతం

టెహ్రాన్‌పై అమెరికా భీకర దాడులు..ఇరాన్‌ సైనిక నాయకులు హతం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఆ దేశానికి చెందిన పలువురు అగ్రశ్రేణి సైనిక నాయకులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

‘టెహ్రాన్‌పై భీకర దాడులు జరిగాయి. ఇందులో ఇరాన్‌ను అవివేకంగా నడిపించిన ఆ దేశ సైనిక నాయకుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు’ అని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో రాసుకొచ్చారు. వారు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దాడికి సంబంధించిన వీడియోలనూ పంచుకున్నారు. దీనిపై ఇరాన్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 48 గంటల్లోగా హర్మూజ్‌ను తెరవాలంటూ ఇరాన్‌కు ట్రంప్‌ అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. హెచ్చరికల అనంతరమే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -