Sunday, April 5, 2026
E-PAPER
Homeజాతీయంకుప్పకూలిన భారీ భవనం..ఇద్దరు మృతి

కుప్పకూలిన భారీ భవనం..ఇద్దరు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారీ భవనం కుప్పకూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ షాకింగ్ ఘటన శనివారం రాత్రి మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లా కోత్మా పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు మరణించగా, శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కోత్మా ప్రధాన మార్కెట్ ప్రాంతంలోని ఒక 4 అంతస్తుల పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో నివసిస్తున్న వారితో పాటు కింద ఉన్న దుకాణాల్లో కొందరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. శిథిలాల నుంచి ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. అలాగే గాయపడిన మరో ముగ్గురిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -