Sunday, April 5, 2026
E-PAPER
Homeఆటలునేడు సన్‌రైజర్స్, లక్నో బిగ్ ఫైట్

నేడు సన్‌రైజర్స్, లక్నో బిగ్ ఫైట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2026లో మరో పరుగుల పండుగకు రంగం సిద్ధమైంది. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు హోరాహోరీ పోరుకు సై అంటున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా నేడు ఈ రెండు జట్ల మధ్య సమరం జరగనుంది. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గత రికార్డులను పరిశీలిస్తే, సన్‌రైజర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ స్పష్టమైన ఆధిపత్యం కనబరుస్తోంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఆరుసార్లు తలపడగా, అందులో నాలుగు మ్యాచ్‌లలో లక్నో విజయం సాధించింది. సన్‌రైజర్స్ కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందింది. గతేడాది ఇదే ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో అద్భుత విజయాన్ని అందుకుంది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు(అంచనా): మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, ఆయుష్ బదోనీ, నికోలస్ పూరన్, అబ్దుల్ సమ్మద్, ముకుల్ చౌదరి, దిగ్వేష్ రాఠీ, మొహమ్మద్ షమీ, నోకియా, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్ / హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్స్ / డేవిడ్ పైన్, ఈషాన్ మలింగ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -