- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాదాపూర్‌లో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఆర్టీసీ బస్సును అడ్డగించి డ్రైవర్‌పై దాడి చేశారు. గూగుల్ ఆఫీస్ సమీపంలో బస్సును ఓవర్టేక్ చేసి, యువకులు తమ కారును బస్సు ముందు అడ్డంగా నిలిపారు. రాళ్లతో బస్సు అద్దాలను పగలగొట్టారు. ఈ ఘటనపై బస్సు డ్రైవర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -



